నేటి నుంచి ప్రజావాణి
17-08-2026 12:00 AM
చిన్నంబావి, ఆగస్టు 16: ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే త్వరితగతిన పరి ష్కరించేందుకు ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మండల ఎంపీడీవో ఆదర్శ్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
ప్రజలు తమ సమస్యలు, విజ్ఞప్తులపై నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. మండల స్థాయి అధికారులు అందరూ నిర్ణీత సమయానికి తప్పనిసరిగా హాజరై, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లే పని లేకుండా తమ మండలంలోనే దరఖాస్తులు ఇచ్చుకోవచ్చని తెలిపారు.






