17 August, 2026 | 1:06 AM

ప్రతి సోమవారం ప్రజావాణి

17-08-2026 12:00 AM

కలెక్టర్ ఖుష్బూ

మహబూబ్ నగర్ ఆగస్టు 16 (విజయ క్రాం తి) : ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం  నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఒక ప్రకటన లో తెలిపారు. మండలంలోని ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను మండల స్థాయిలో ఎం .పి డి. ఓ కార్యాలయం లో ఉదయం 10 గం టల నుండి 1 గంట వరకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అధికారుల కు అందజేయాలని సూచించారు.

ప్రజల సౌకర్యార్థం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తున్నందున, జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మండ ల స్థాయిలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీ లించి, నిబంధనల మేరకు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.