13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కేవీకేలో పంట మార్పిడి పైన అవగాహన సదస్సు

31-03-2026 05:21 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కన్నాల రైతు వేదికలో  రైతులకు పంటల విభిన్నీకరణపై అవగాహన కల్పించారు. బెల్లంపల్లి కేవీకే (KVK) ఆధ్వర్యంలో మంగళవారం  అవహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు  ముఖ్య అతిథిగా కేవికే ప్రోగ్రామ్ సమన్వయకర్త డా. ఎం. ప్రసూన పాల్గొని రైతులకు పంటల మార్పిడి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఒకే పంటపై ఆధారపడకుండా, వాతావరణ మార్పులు మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలు పంటలను సాగు చేయడంతో రైతులు లాభాలను పెంచుకోవచ్చని తెలిపారు.

శాస్త్రవేత్త డా. ఎన్. మహేష్ జిల్లాలో పంటల మార్పిడి కి  అనువైన ప్రత్యామ్నాయ పంటలు, వాటి సాగు పద్ధతుల (ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్) గురించి రైతులకు సమగ్రంగా వివరించారు. డా. యు. శ్రావంతి ఆయిల్ పామ్ సాగులో అనుసరించాల్సిన నిర్వహణ పద్ధతులను వివరించి, రైతులు ఈ పంట ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు ప్రేమ్ కుమార్, ఫర్హీన్, ఉద్యానవన శాఖ అధికారి అర్చన, వ్యవసాయ విస్తరణ అధికారి తిరుపతి పాల్గొన్నారు.