మాస్టర్ ట్రైనర్లకు నూతన పాఠ్యపుస్తకాలపై శిక్షణ కార్యక్రమం
నేరేడుచర్ల,(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని కాచిగూడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నూతన పాఠ్యపుస్తకాల అమలులో భాగంగా ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల చరిత్ర అధ్యాపకులు,చరిత్ర విభాగం మాస్టర్ ట్రైనర్ డా. మద్దెమడుగు . సైదులు పాల్గొని, జిల్లా వనరుల వ్యక్తులకు బోధనలో అనుసరించాల్సిన ఆధునిక పద్ధతులను వివరించారు. ప్రత్యేకంగా విద్యార్థుల ప్రాజెక్ట్ వర్క్, కార్యాచరణ ఆధారిత అభ్యాసనం విశ్లేషణాత్మక నైపుణ్యాల అభివృద్ధిపై అవగాహన కల్పించారు. నూతన పాఠ్యపుస్తకాల లక్ష్యాలను సమర్థవంతంగా విద్యార్థులకు చేరవేసే విధానాలపై శిక్షణ అందించారు.ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్ ట్రైనర్లు, జిల్లా వనరుల వ్యక్తులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






