1 August, 2026 | 10:33 PM

తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించాలి

01-08-2026 09:55 PM

కలెక్టర్ కె హరిత

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు–2026 సందర్భంగా "Breastfeeding for a Sustainable Start in Life: Strengthen What Works"  అవగాహన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ కె . హరిత ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుట్టిన గంటలోపు శిశువుకు తల్లిపాలు పట్టించడం, మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వడం,

అనంతరం పరిపూరక ఆహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం వల్ల శిశువుల ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి మెరుగుపడుతాయని తెలిపారు.ఆగస్టు 1 నుంచి 7 వరకు పోషణ్ అభియాన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, గర్భిణీలు–బాలింతల సమావేశాలు, ఇంటింటి సందర్శనలు, కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.