1 August, 2026 | 10:25 PM

విద్యార్థుల్లోనాయకత్వ లక్షణాలు ఉండాలి

01-08-2026 09:53 PM

డిఈఓ విజయ కుమారి

రాజపూర్: విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ప్రతి పాఠశాలలో మ్యాక్ పోలింగ్ నిర్వహించనున్నట్లు డిఈఓ విజయ్ కుమార్ అన్నారు. శనివారం మండలంలోని రంగారెడ్డి కూడా గ్రామంలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఓటింగ్ విధానం పై అవగాహన కల్పించడంలో భాగంగా నమూనా  స్టూడెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించిన తీరును పరిశీలించారు.

ఈ ఎన్నికల్లో విద్యార్థులు హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్కర్, క్లాస్ రిప్రెజెంటేటివ్ గా రెండు ప్యానల్ గా అందులో ఒకటి ఏపీజే అబ్దుల్ కలాం ప్యానెల్, రెండవది రవీంద్రనాథ్ ఠాగూర్ ప్యానల్ గా ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి అంశాన్ని స్పర్షిస్తూ ఓటింగ్ నిర్వహించారు. ప్రిసైడింగ్ అధికారిగా  శివ టెన్త్ క్లాస్, అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారిగా  భాను ప్రసాద్  ఎన్నికల అధికారులుగా నాగలక్ష్మి, ప్రణతి వ్యవహరించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సవ భరితంగా  ఎన్నికల్లో పాల్గొన్నారు.