06-02-2026 01:15:27 AM
ప్రొఫెసర్ హుస్సేన్
మెదక్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి) :ప్ర భుత్వ డిగ్రీ కళాశాల మెదక్లో విద్యార్థుల్లో ఎ లక్ట్రానిక్ వ్యర్థాల (E-Waste) పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ-వేస్ట్ మేనే జ్మెంట్ అనే అంశంపై ఒక అవగాహన కార్యశాలను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు.ఈ కార్యక్రమాన్ని కళాశాలలోని భౌతిక శాస్త్ర విభాగం, తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (TSKC) వారు సంయుక్తంగా నిర్వహించార ని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యశాలకు రి సోర్స్ పర్సన్గా హేమంత్ కృష్ణ, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ సాంకేతిక నిపుణులు, హా జరై తమ పవర్పాయింట్ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా, ప్రామాణిక విధానాలలో రీసైక్లింగ్ చేయవలసిన ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ మాట్లాడుతూ,నేటి డిజిటల్ యు గంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, గృహోపకరణాల వాడకం పెరుగుతు న్న నేపథ్యంలో వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి మరి యు మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు గా మారుతున్నాయని, విద్యార్థులు ఈ విషయంలో అవగాహన కలిగి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంత గానో ఉందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సుమారు 5 నుండి 6 కోట్ల మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని, అందులో కేవలం తక్కువ శాతం మాత్రమే శాస్త్రీయంగా రీసైక్లింగ్ అవుతోందని తెలిపారు.భారతదేశం ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ముందున్న దేశాలలో ఒకటిగా ఉండి, సంవత్సరానికి సుమారు 30 లక్షల మెట్రిక్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, కేంద్ర ప్రభుత్వం ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ద్వారా నియంత్రణ చర్యలు చేపడుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన 58 మంది విద్యార్థులు ఉత్సా హంగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరియు భౌతిక శాస్త్ర విభాగాధిపతి శ్రీ ఏ. సింహారెడ్డి, కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ వై. ప్రవీణ్ కుమార్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. తిరుమ ల్ రెడ్డి, భౌతిక శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ సి. సుధారాణి, మరియు కళాశాల TSKC మెంటార్ శ్రీ అంజయ్య పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.