calender_icon.png 6 February, 2026 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోటిస్తాం.. ఓటేయండి!

06-02-2026 01:16:57 AM

  1. బల్దియా ఎన్నికల్లో అభ్యర్థుల ప్రలోభాలు

విచ్చలవిడిగా మద్యం, డబ్బుల పంపిణీ

గెలుపే లక్ష్యంగా నిబంధనల ఉల్లంఘన

పట్టించుకోని ఎన్నికల అధికారులు

జిన్నారం/అమీన్ పూర్, ఫిబ్రవరి 5 :మున్సిపాలిటీ ఎన్నికల్లో మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. కౌన్సిలర్లుగా పో టీ చేస్తున్న వారంతా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేం దుకు విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తుండగా& ఇందులో మద్యం కీలకంగా మారు తోంది. వైన్ షాపులు తెరవడమే తరువాయి అన్నట్లుగా ఉదయం 10 గంటల నుంచి మొదలుపెడితే రాత్రి 10 గంటల వరకు విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి.

డిసెంబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రావడంతో కొత్తగా దుకాణాలు దక్కించుకున్న వారికి ఈ ఎన్నికలు హుషారెత్తిస్తున్నాయి. పటాన్చెరు నియోజకవర్గం లోని జిన్నారం, గడ్డపోతారం, ఇంద్రేశం, ఇస్నాపూర్, గుమ్మడిదల కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పాటు అయ్యాయి. అయితే ప్ర స్తుతం ఈ మున్సిపాలిటీల్లో 11న ఎన్నికలు జరుగుతున్నాయి. కౌన్సిలర్ అభ్యర్థులు హో రాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఓటర్లను ఆకట్టుకోవడానికి డబ్బు, మద్యం విచ్చ లవిడిగా పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు బలపర్చిన అభ్యర్థుల తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. ఇక్కడ త్రిముఖ పో టీతో పాటు అక్కడక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే బలమైన పోటీ ఉందని తెలుస్తోంది. కొన్నిచోట్ల బిజెపి గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే అభ్యర్థులు తమదే గెలుపు అంటూ ఓటర్లను మభ్యపెడుతూ విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నా ఎన్నికల అధికారులు చూ సీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నిబంధ నలను ఉల్లంఘిస్తూ అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో ఐదు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఒక్కో ఓటుకు రేటు కడుతూ ఓటర్లను తమవైపుకు తిప్పుకుంటున్నారు. మున్సిపాలిటీ ఎన్నికలలో నియమా వళి ఉల్లంఘిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం.

మాటల్లోనే నియంత్రణ&?

ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే ఏ రకమైన వ్యవహారాలను ఉపేక్షించబోమని జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. కానీ అందుకు భిన్నంగా పరిస్థితి క్షేత్ర స్థా యిలో కనిపిస్తోంది. నిఘా బృందాలు మో హరించినప్పటికీ అవేవి మద్యాన్ని పట్టుకున్న దాఖలాలే లేవు. ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున మద్యం డంప్ అయినట్లు స మాచారం. 

ఐఎంఎల్ డిపో నుంచి బయటకు వచ్చిన మద్యం వివరాలు పరిశీలిస్తే గతం కంటే ఎక్కువగా ఈ వారం రోజుల్లో మద్యం విక్రయాలు జరిగాయి. ఇండెంట్ ఇచ్చిన మద్యం దుకాణాల ఆధారంగా తనిఖీలు చేపడితే మద్యం నియంత్రణ సులువు అవుతుంది.