22 June, 2026 | 8:06 PM

Breaking News

బెల్లంపల్లి ఆసుపత్రి ఎదుట..   •   ప్రభుత్వ విప్ విజయరమణ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్, బీజేపీ నాయకులు..   •   పెన్షనర్ ల సమస్యను పరిష్కరించండి   •   పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలి   •   ప్రైమరీ టీచర్ల భర్తీలలో జిల్లా వ్యాప్తంగా ఒకే విధానం కొనసాగాలి   •   కోయగూడెం ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) తిరుమల రావు పర్యటన   •   అమెరికాలో గంగారం యువకుడు మృతి   •   విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •  

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

06-02-2026 01:14 AM

భూత్పూర్ 7వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి లత సూరన్న  

భూత్పూర్, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): గ్రామంపై, వార్డుపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న లత సూరన్నకి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఆ వార్డు ప్రజలు చెబుతున్న మాట.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు బీజేపీకి మద్దతు తెలియజేసి తమకు అవకాశం కల్పించాలని పూర్తిస్థాయి లో అభివృద్ధి చేసి చూపిస్తానని 7వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి లత సూరన్న అన్నా రు. భూత్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు అభివృద్ధి కోసం తనకు ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలన్నారు. గురువారం ఏడవ వార్డులో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మున్సిపాలిటీ లు అభివృద్ధి సాధ్యమని అన్నారు.

7వ వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఇంటింటి ప్రచారంలో ఓటర్లు స్పందిస్తున్నారని అన్నారు. ఒకసారి గెలిపించి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఏడవ వార్డు కౌన్సిలర్ గా తనను గెలిపించాలని ఆమె ఓటర్లను విజ్ఞప్తి చేశారు.కేంద్ర ప్రభు త్వం పూర్తిస్థాయిలో మున్సిపాలిటీలు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిం చడంతో బీజేపీకి పుర ఓటర్లు మద్దతు తెలియజేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో లతా సూరన్నకి రోజురోజుకు మద్దతు పెరుగుతుందని వార్డువాసులు పేర్కొంటున్నారు. కార్య క్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.