20 August, 2026 | 3:16 AM

21న అయుర్వేద వైద్య శిబిరం

20-08-2026 12:00 AM

ఏరియా అధికార ప్రతినిధి ఎస్ శ్యాంసుందర్ సద్వినియోగం చేసుకోవాలని పిలుపు 

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 19 (విజయ క్రాంతి): ఈనెల 21న సింగరేణి సేవా సమితి భూపాలపల్లి ఏరియా ఆద్వర్యంలో డాక్టర్ విశ్వనాధ మహర్షి ఆయుర్వేద స్పెషలిస్టు నేతృత్వంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి ఎస్ శ్యాంసుందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం స్థానిక క్రిష్ణకాలని సీఈఆర్ క్లబ్ నందు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వైద్య శిబిరంలో చర్మ వ్యాధులు, మోకాళ్ల నొప్పులు, గుండె దడ, బీపి, షుగర్, థైరాయిడ్, మల బద్ధకం, అజీర్ణం, పక్షవాతం, అస్తమా, స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు డాక్టర్ విశ్వనాధ మహర్షి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. పూర్తి వివరాల కోసం 9849574706 నెంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు.