09-11-2025 06:51:25 PM
ఆళ్ళపల్లి (విజయక్రాంతి): మండల పరిధి మర్కొడు గ్రామ అయ్యప్ప దీక్షదారులు గురు స్వామి రణం మల్లికార్జున్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామంలో కొలువుదీరిన శ్రీ హిమాచల లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి మల్లికార్జున్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా కార్తీక మాసంలో, అయ్యప్ప దీక్షదారులతో పుణ్యక్షేత్రాలను దర్శించడం జరుగుతుందని ఇదే క్రమంలో మల్లూరులోని హేమాచల నరసింహస్వామిని దర్శించుకోవడం జరిగిందన్నారు.
పుణ్యక్షేత్రాల సందర్శనతో మనసుకు ఆధ్యాత్మిక భావనతో పాటు మనశ్శాంతి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు భద్రం స్వామి రాజబాబు స్వామి భరత్ స్వామి జనార్దన్ స్వామి నగేష్ స్వామి వెంకన్న స్వామి శేఖర్ స్వామి సాగర్ స్వామి సాయి స్వామి నవీన్ స్వామి వెంకటేశ్వర స్వామి వినయ్ స్వామి నితీష్ స్వామి నిఖిల్ స్వామి విశ్వనాథం స్వామి తదితరులు పాల్గొన్నారు.