21-12-2025 03:38:58 PM
న్యూఢిల్లీ: రైలు టిక్కెట్ల ధరలను పెంచుతున్నట్లు భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణానికి సాధారణ తరగతిలో కిలోమీటరుకు 1 పైసా, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ల నాన్-ఏసీ తరగతులకు అన్ని రైళ్ల ఏసీ తరగతులకు కిలోమీటరుకు 2 పైసలు, 500 కిలోమీటర్ల దూరానికి నాన్ ఏసీ ప్రయాణీకుల నుంచి అదనంగా రూ.10 వసూలు చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. కొత్త ధరలు డిసెంబర్ 26, 2025 నుండి అమల్లోకి వస్తాయి.
సబర్బన్ రైళ్ల నెలవారీ సీజన్ టిక్కెట్లలో, ఇతర రైళ్ల సాధారణ తరగతిలో 215 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి ఛార్జీల పెంపు లేదని అధికారులు తెలిపారు. ఈ ఛార్జీల పెంపు ద్వారా మార్చి 31, 2026 నాటికి రైల్వేలకు రూ.600 కోట్లు ఆదాయం సమకూరుతుందని వారు పేర్కొన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం... జూలై 2025లో చేసిన గత ఛార్జీల పెంపు ద్వారా ఇప్పటివరకు రూ.700 కోట్ల ఆదాయం సమకూరింది.