02-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీకారం
సనత్‌నగర్ నవంబర్ 1 (విజయక్రాంతి):- అయ్యప్ప స్వామి నామ స్మరణ ఎంతో మధురమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బేగంపేట లోని ప్రకాష్ నగర్ లో గల భూ లక్ష్మమ్మ ఆలయం నుండి శబరిమల వరకు సాగే అయ్యప్ప స్వాముల పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా భూ లక్ష్మమ్మ, సాయిబాబా ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం జెండా ఊపి అయ్యప్ప స్వాముల పాదయాత్ర ను ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీని వాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, నరేందర్, శేఖర్, చింటు, అఖిల్ తదితరులు ఉన్నారు.