02-11-2025 12:00:00 AM
సీసీ రోడ్డు పనులు పరిశీలించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్
కాప్రా, నవంబర్ 1(విజయక్రాంతి) : చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఎస్సీ బస్తీలో జరుగుతున్న 280 మీటర్ల సీసీ రోడ్ పనులను జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి బస్తీ అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.
స్థానిక ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్ పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి.ఈ బాలకృష్ణ, ఏ.ఈ అభిషేక్, ప్రశాంత్, ప్రవీణ్ గౌడ్తో పాటు స్థానిక నాయకులు డి.లక్ష్మయ్య, ఎం.లక్ష్మయ్య, కె.నర్సింహా, కొమ్ము సురేష్, జి.భాను చందర్, జి.గణేష్ గౌడ్, టి.సురేష్, పి.శ్రీనివాస్, మంచాల అనిత, కొమ్ము ఇందిర, పందిగారి కిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు.