calender_icon.png 2 November, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈడబ్ల్యూఎస్ మాదిరిగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి

02-11-2025 12:02:23 AM

  1. బీసీలకు 42% బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలి
  2. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి

ముషీరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): రాజ్యాంగ సవరణ చేసి, ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు ఎలా ఇచ్చారో బిసిలకు 42 శాతం బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణంలో బీసీ రిజర్వేషన్లు ఒక కీలక అడుగు అని అన్నారు. తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై సదస్సు టిజెఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు అధ్యక్షతన శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో సదస్సు జరిగింది.

జస్టిస్ చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్ర మూర్తి, ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్బంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తాను సామాజిక సృహ కలిగిన వ్యక్తినని, తాను బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదని అన్నారు. రాజ్యం గం పట్ల అవగాహన, సమాజంలో ఉన్న పరిస్థితులపై అవగాహన చేసుకొని మాట్లాడే వారు ఎవరినైనా స్వాగతించాలని అన్నారు. దేశంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సామాజిక న్యాయం కోసం ప్రజా ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు.

రిజర్వేషన్లు అంటే ఉద్యోగాలు, అవకాశాలు కోసం అనేది అపోహ అని అన్నారు. రాజ్యాంగం కన్నా ముందు అట్టడుగు వర్గాలకు అవకాశాలు దక్కలేదని అన్నారు. అప్పుడు లేని ప్రస్తావన, ఇప్పుడు రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి పెట్టడం హాస్యాస్పదం అన్నారు. 1961 జనాభా లెక్కలు తీసుకొని రిజర్వేషన్లపై పరిమితి పెట్టారని, అప్పటికి ఇప్పటికి జనాభాలో సామాజిక అంశాల్లో అనేక మార్పులు వచ్చాయని అన్నారు.

వాటిని పరిగణలోకి తీసుకొని, న్యాయస్థానాలు వ్యవహరించాలని అన్నారు. సామాజిక న్యాయం కోసం దేశం మొత్తం తిరుగుతున్న రాహుల్ గాంధీ ని ప్రజలు అర్థం చేసుకోవడం లేదని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు 2019 జనవరిలో జరిగాయని, 2024 జనవరిలో వారి పదవి కాలం ముగిసిందన్నారు. హైకోర్టు ఎన్నికలు నిర్వహిం చాలని ఆదేశాలు ఇచ్చిందని, రిజర్వేషన్లు పెంచి ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ వేసిందన్నారు.

ప్రభుత్వం బిసి లెక్కలు తీసి, రిజర్వేషన్లు 42 శాతానికి పెంచి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపిందని తెలిపారు. గవర్నర్ ఆమోదించక పోవడంతో ప్రభుత్వం జీవో తీసుకురావడంతో హైకోర్టు స్టే విధించిందని అన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడు తూ స్వాతంత్రం వచ్చిన తరువాత అంటరానితనం, సామాజిక, ఆర్థిక పరిస్తితుల వ్యత్యాసం సమాజంలో ఉందని అన్నారు. బ్యాక్ వర్డ్ క్యాస్ట్ ల కోసం ఆర్టిల్ 340 తీసుకొచ్చారని అన్నారు.

కాకా కేల్కర్ కమిషన్ నుండి బ్యాక్ వర్డ్ కాస్ట్ లకు నష్టం ప్రారంభమైందని గుర్తు చేశారు. వి.పి.సింగ్ బిసిలకు రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ వేస్తే, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మనువాదులు కమండలం యాత్ర చేపట్టారని అన్నారు. అనాదిగా బిసిల రిజర్వేషన్లు దక్కకుండా కుట్రలు చేశారని అన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ రిజర్వేషన్ల అమ లు వల్ల కుల, మతాలకు అతీతంగా గౌరవ ప్రదమైన జీవనం సమాజంలో దక్కుతుంద న్నారు.

అందుకోసం నవంబర్ నెలలో అన్ని జిల్లాలో సదస్సులు, డిసెంబర్ లో హైదరాబాద్‌లో భారీ ర్యాలీలు నిర్వహిస్తాం అన్నా రు. జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. కోర్టులు కూడా 50 శాతం పరిమితిపై శిలా శాసనం ఏమి పెట్టలేదని అన్నారు.