calender_icon.png 18 November, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా అయ్యప్పస్వామి మహా పడిపూజ మహోత్సవం

18-11-2025 12:30:23 AM

హనుమకొండ టౌన్, నవంబర్ 17 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమారం దుర్గామాత ఆలయంలో సోమవారం అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఆరే రవీందర్ రెడ్డి- పద్మ దంపతులు, కమలాపురం అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన అర్చకులు జానకి రామయ్య, అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ నిర్వహకులు విలాసారపు వీరస్వామి చేతుల మీదుగా అంగర వైభవంగా నిర్వహించారు. 18 మెట్లను పూలతో అలంకరించి కర్పూర దీపాలు వెలిగించి పడి పూజ చేశారు. కన్నులపండువగా మహా పడిపూజ జరిగింది.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప కీర్తనలతో బీమారం ప్రాంతమంతా మార్మోగింది. అనంతరం అయ్యప్ప మాల ధరించిన స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అరె రవీందర్ రెడ్డి గురుస్వామి మాట్లాడుతూ 2025 లో దుర్గామాత ఆలయంలో తన చేతుల మీదుగా మొదటి అయ్యప్ప స్వామి మహా పడిపూజ నిర్వహించడం ఆనందంగా ఉందని అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.