విజ్ఞాన ప్రదర్శనలు... విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వేదికలు
విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగంలో.... నూతన ఆవిష్కరణలు చేపట్టాలి
సైన్సే సర్వ మానవాళికి మూలం: సైన్స్ టీచర్ చంద్రకళ
గీతాంజలి హైస్కూల్లో ఘనంగా సైన్స్ ఫెయిర్
జవహర్ నగర్,(విజయక్రాంతి): విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వేదికలని, విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలు చేపట్టాలని ప్రభుత్వ పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు చంద్రకళ అన్నారు. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ గీతాంజలి హై స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఘనంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు చంద్రకళ, జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ హాజరై జ్యోతి వెలిగించి రిబ్బన్ కట్ చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ భవిష్యత్తులో శాస్త్ర రంగంలో మరిన్ని ఆవిష్కరణలు చేసి దేశానికి గౌరవం తీసుకురావాలని తెలిపారు సమకాలీన సమస్యలకు పరిష్కాలను సూచించే విధంగా విద్యార్థుల ఆలోచనలు రూపుదిద్దుకోవడం సంతోషకరమన్నారు.
విద్యార్థుల కృషి అంకితభావం ఉపాధ్యాయుల మార్గదర్శకత్వానికి ప్రత్యేకత గా నిలుస్తుంది అన్నారు. ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలుగు తీయడం సృజనాత్మకతను పెంపొందించడం శాస్త్రీయ ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేయడం వైజ్ఞానిక ప్రదర్శన ముఖ్య ఉద్దేశం అన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి ఆధ్వర్యంలో లీడ్ తెలంగాణ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ వరలక్ష్మి నేతృత్వంలో ఈ ప్రదర్శన కొనసాగింది. ఈ ప్రదర్శనలో సుమారుగా 115 నుండి 120 మోడల్ ప్రదర్శించబడగా వాటికి సందర్శకుల నుండి విశేష స్పందన లభించింది.
ప్రతిస్టాల్ వద్ద విద్యార్థులు ఉత్సాహంగా తమ ప్రాజెక్టులను వివరిస్తూ ఆకట్టుకున్నారు. చిన్నారుల నుంచి ఉన్నత తరగతి విద్యార్థుల వరకు అందరిలోనూ ఉత్సాహం ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, ప్రిన్సిపల్ కృష్ణవేణి, పాఠశాల కరస్పాండెంట్ కృష్ణ, వైస్ ప్రిన్సిపల్ కర్నే సురేందర్, ఉపాధ్యాయులు మురళి, ప్రవీణ్, అజిత్, శారద, కుమారి, జ్యోతి , వి. జ్యోతి, భాగ్యలక్ష్మి, లక్ష్మి, పర్యవేక్షకురాలు నాగలక్ష్మి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.




