సుల్తానాబాద్‌లో ఘనంగా నేషనల్ సైన్స్ డే వేడుకలు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): మై భారత్ మేరాయువ భారత్ ,సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీవాణి డిగ్రీ , పీజీ కళాశాల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో శనివారం నేషనల్ సైన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇంచార్జ్ సంతోష్ , మరియు రజిత , ప్రోగ్రాం ఆర్గనైజర్ మహేష్ పాల్గొని జాతీయ సైన్స్ దినోత్సవం-2026 'విజ్ఞాన శాస్త్రంలో మహిళలు: విక్సిత్ భారత్‌ను ఉత్ప్రేరకపరచడం' అనే ఇతివృత్తాన్ని జరుపుకుంటుంది.
శాస్త్రీయ పరిశోధన, మహిళల నేతృత్వంలోని ఆవిష్కరణల పట్ల యొక్క నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది, ఇది భారతదేశాన్ని స్వావలంబన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది విద్యార్థులకు వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించారు, వారిలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, యువజన సంఘాల నాయకులు సిద్ధార్థ , నితిన్, తదితరులు పాల్గొన్నారు.




