18-11-2025 12:29:47 AM
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి) : బీసీ రిజర్వేషన్లపై సీఎం నేతృత్వంలో అఖిలపక్షం తో ఢిల్లీకి వెళ్లాలని, క్యాబినెట్ సమావేశంలో ఢిల్లీకి వెళ్లే అఖిలపక్ష తేదీని నిర్ణయించాలని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ హామీని నిలబెట్టుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబులతో జాజుల శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు.
అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇండి యా కూటమి తరపున బీసీ రిజర్వేషన్లపై పోరాడాలన్నారు. కేంద్రంపై రాష్ర్టం పోరాడి బీసీ రిజర్వే షన్ల చట్టానికి ఆమోదం తెలిపేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా క్యాబినెట్‌లో స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్‌కు గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.
ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీ యాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరాడకపోతే బీసీలకు మొదటి ముద్దా యి కాంగ్రెస్ అవుతుందని హెచ్చరించారు. బీసీ బిల్లుకు ఆమోదం తెలపాల్సిన కేంద్రం ఆమోదించకపోతే బీసీలకు మొదటి దోషి బీజేపీనే అవు తుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ తన కర్తవ్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలని, లేదంటే బీసీ ల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురి కావాల్సి వస్తుందన్నారు. కేంద్రంపై పోరాడితే కాంగ్రెస్‌కు బీసీ సమాజం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.