28 February, 2026 | 10:47 PM

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

28-02-2026 08:54 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తాడువాయి ఇన్చార్జి ఎంపీడీవో సవిత రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలను ఆమె శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె వంటగదిలోకి వెళ్లి భోజనాన్ని పరిశీలించారు.

నిర్వాహకులతో మాట్లాడుతూ ప్రతిరోజు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం విద్యార్థులకు అందించాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న కూరగాయలు, బియ్యం ఎలా ఉన్నాయి అనే విషయమై పరిశీలించారు. స్టాకు రిజిస్టర్ ను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయరాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు