28 February, 2026 | 9:29 PM

యువత కోసం యువ మండల్ వికాస్ అభియాన్

28-02-2026 08:08 PM

యువత కోసం యువ మండల్ వికాస్ అభియాన్

సుల్తానాబాద్.(విజయక్రాంతి): గ్రామీణ యువతను ఏకం చేసి వారిని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా 'మై భారత్ పెద్దపల్లి,  స్వామి వివేకనంద యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో "యువ మండల్ వికాస్ అభియాన్" కార్యక్రమాన్ని 5 రోజులలో 50 గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి, డిగ్రీ , పీజీ కళాశాల ఆవరణలో  యువజన నాయకులకు యూత్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ప్రోగ్రాం ఆర్గనైజర్ రేషవేణి మహేష్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉన్న యువజన సంఘాలను బలోపేతం చేయడమే లక్ష్యం అని తెలిపారు. ఇప్పటివరకు యువజన సంఘాలు లేని ప్రాంతాల్లో నూతన. సంఘాలను ఏర్పాటు చేసి, వారిని 'మై భారత్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విభాగాలకు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు.

దీనివల్ల భవిష్యత్తులో మై భారత్ నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో గ్రామీణ యువత చురుగ్గా పాల్గొనే అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో  కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సంతోష్ , ప్రోగ్రామ్ ఆర్గనైజర్ రేషవేణి మహేష్ , వివేకనంద యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రేషవేణి సిద్ధార్థ, ఉపాధ్యక్షులు నితిన్, అభిషేక్, కార్యదర్శి సోను, రిషి ,ఆదర్శ్ ,రాకేష్, ఇర్ఫాన్ ,నితిన్ యువజన సంఘాల నాయకులు ధీరజ్ , రాజు తదితరులు పాల్గొన్నారు.