28 February, 2026 | 10:17 PM

క్షేత్ర దినోత్సవం

28-02-2026 08:49 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం వారి ఆధ్వర్యంలో వేరుశనగ నూతన రకం–టీజిసిఎస్ 1694 (విశిష్ట) క్షేత్ర దినోత్సవన్ని  నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పరిశోధన కేంద్రం హెడ్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి. రామ్ ప్రసాద్ మాట్లాడుతూ... తిరుపతి వ్యవసాయ పరిశోధన కేంద్రం వారు అభివృద్ధి చేసిన ఈ రకం సగటున 105–110 రోజుల వ్యవధిలో పంట వస్తుందని, ఎకరానికి 13.3–14.3 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తుందని సుమారు 50% నూనె శాతం, 73–75% గింజ శాతం కలిగి ఉంటుందని,

గింజలు ముదురు రంగులో ఉండి మంచి నాణ్యత కలిగి వుండి వ్యాధి నిరోధకతలో కూడా  మెరుగ్గా ఉండి ఎండ ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుందని తెలియజేశారు. రైతులు ఈ రకాన్ని సాగు చేసి అధిక దిగుబడి సాధించవచ్చునని తెలిపారు. ఈ క్షేత్ర ప్రదర్శనలో  శాస్త్రవేత్తలు డా ఇ. రజినీకాంత్, డా ఉషా రాణి, డా ఉమ రాణి, డాక్టర్ ఎ. హరికిషన్, డా కె. మధుసుధన్ రెడ్డి, డా రాజేంద్ర ప్రసాద్, కొత్తపల్లి మండల వ్యవసాయాధికారి కోట సంతోష్ కుమార్, విద్యార్థులు మరియు రైతులు పాల్గొన్నారు.