19-12-2025 05:59:14 PM
నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలో శనివారం ఎమ్మెల్యే, ఉద్దీపన చైర్మన్ శ్రీ వేముల వీరేశం–పుష్ప దంపతుల స్వగృహంలో శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి 4వ మహపడి పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ చంద్రమౌలి వెంకటేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పూజకు మాలాధారణ చేసిన అయ్యప్ప స్వాములు, భక్తులు హాజరై స్వామి వారి దీవెనలు, తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.