17 April, 2026 | 2:51 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పారిశుధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రాధాన్యత

19-12-2025 06:01 PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

నకిరేకల్,(విజయక్రాంతి): పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం తెలిపారు. శుక్రవారం నాడు నకిరేకల్ మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణ పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

కార్మికులు తమ ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ వహించాలని, ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. వైద్య శిబిరం ద్వారా పారిశుధ్య కార్మికులకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు, మందులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత–శ్రీనివాస్, పిఎసియస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ కమిషనర్ రంజిత్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు గాజుల సుకన్య, నాయకులు మురారి శెట్టి కృష్ణమూర్తి, యాసారపు వెంకన్న, మట్టిపల్లి వీరు ,పన్నాల శ్రీనివాస్ రెడ్డి ,ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.