calender_icon.png 14 January, 2026 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటుకోళ్ల ఫామ్ లో 1800 కోళ్లు మృతి

14-01-2026 08:31:17 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం  వీరాపూర్ లో ఓ నాటు కోళ్ల ఫారంలో1800 నాటు కోళ్ళు మృత్యువాతపడ్డాయి. వివరాలిలా ఉన్నాయి. సోండ్ల చంద్రు అనే రైతు స్వయం ఉపాధి కోసం ఇటీవలనే కోళ్ల ఫామ్ ఏర్పాటు చేశాడు. అంతచిక్కని వ్యాధితో రెండు రోజుల వ్యవధిలోనే 1800 కోళ్ళు మృతి చెందాయి. బుధవారం మృతి  చెందిన కోళ్లను భీమిని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ సర్జన్ దొబ్బల కిరణ్, సిబ్బంది పరిశీలించారు. అంతు చిక్కని వ్యాధితోనే ఈ కోళ్లు మృతి చెందాయని భావించారు.

వ్యాధి నిర్ధారణ పరీక్షలు కోసం కోళ్ల నుంచి ఐదు శాంపిల్లను సేకరించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ ల్యాబ్ కు పంపారు. నాటు కోళ్ల మృతి వల్ల రూ.10 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరి జరిగిందని కోళ్ల ఫామ్ రైతు చంద్రు తెలిపారు. మూడు నెలల క్రితం చంద్రు స్వయం ఉపాధి కోసం గ్రామంలో స్వంత ఖర్చులతో నాటుకోళ్ల ను పెంచుతున్నాడు. సోమ, మంగళ  రెండు రోజుల వ్యవధిలోనే 18 వందల కోళ్లు మృతి చెందాయి. కోళ్ల ఫామ్ రైతు వెటర్నరీ డాక్టర్ శ్వేత ద్వారా కోళ్లకు మందులు వాడినా  ఫలితం లేకుండా పోయింది. నాటు కోళ్ల మృతితో జీవనాధారం కోల్పోయిన రైతు చంద్రు ప్రభుత్వం నుంచి సహాయాన్ని కోరారు.