ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణం
హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి (Telangana Jana Samithi) చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి అజారుద్దీన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukender Reddy) ఇద్దరితో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy),మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్,పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్,ఎంపీ వేం నరేందర్ రెడ్డి,ప్రభుత్వ విప్ లు,ఎంఎల్సీలు, ఎంఎల్ఏలు హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, అలాగే ప్రొఫెసర్ కోదండరాంలను తెలంగాణ శాసన మండలి సభ్యులుగా నామినేట్ చేశారు. పెండింగ్‌లో ఉన్న నియామకాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన అధికారిక విజ్ఞప్తి మేరకు, ఆదివారం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ఈ నామినేషన్లు ఖరారయ్యాయి.






