18 August, 2026 | 1:20 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ​ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు

27-04-2026 10:39 AM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌ కొరత ఏర్పడింది. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల పెట్రోల్‌ బంక్‌లు మూసివేశారు. పలు జిల్లాల్లో పెట్రోల్‌ బంక్‌లలో నో స్టాక్‌ బోర్డ్‌లు దర్శనమివ్వగా, పలు చోట్ల బంక్‌లు మూతపడ్డాయి. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఆదివారం రాత్రి నుంచి పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొన్నాళ్లుగా సీఎన్‌జీ కొరత

హైదరాబాద్ నగరంలో కొన్నాళ్లుగా సీఎన్‌జీ కొరత కొనసాగుతోంది. సీఎన్‌జీ కోసం బంకుల ముందు ఆటోలు బారులు తీరాయి. జిల్లాల్లోనూ పెట్రోల్, డీజిల్ దొరకటం లేదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పలు జిల్లాల్లో బంకుల్లో నోస్టాక్ బోర్డు ఉందని వాహనదారులు వాపోతున్నారు. కొన్ని చోట్ల పెట్రోల్ లభ్యత ఉండగా డీజిల్ కొరత ఏర్పడటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.