15 April, 2026 | 9:36 AM

అజారుద్దీన్‌కు శాఖ లాపతా!

04-11-2025 01:24 AM

-మంత్రిగా ప్రమాణం చేసి నాలుగు రోజులు

-ఇప్పటివరకు శాఖ కేటాయింపుపై రాని స్పష్టత

-జూబ్లీహిల్స్ ఎన్నికలవరకు కేటాయింపు లేనట్టే

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజా రుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసి నాలు గు రోజులు గడుస్తున్నా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ శాఖను కేటాయించలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లిం మై నార్టీల ఓట్ల కో సమే అజారుద్దీన్‌కు మం త్రి పదవి ఇచ్చారనే ఆరోపణలు వచ్చా యి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే శాఖ కేటాయింపు జరుగుతుందనే ప్రచా రం వినిపిస్తోంది.

అజారుద్దీన్ హోంశాఖతోపాటు క్రీడల శాఖ కూడా కావాలని పార్టీ పెద్దల వద్ద పట్టుపడుతున్నట్టు సమాచారం. హోం శాఖను అజారుద్దీన్‌కు ఇచ్చేందుకు పార్టీ అధిష్ఠానం సు ముఖంగా లేదని తెలుస్తోంది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద ఉన్నది. రాష్ట్రం లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అజారుద్దీన్ కు హోంశాఖ ఇవ్వ డం కుదరదని తేల్చిచెప్పినట్టు సమాచారం. బీఆర్‌ఎస్ హ యాంలో మహమూద్ అలీకి హోంశాఖ ఇచ్చినట్టుగానే.. అ జారుద్దీన్ కూడా కట్టపెట్టి అధికారాలు మాత్రం సీఎం వద్దే పెట్టుకోవాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టు కాంగ్రెస్‌లో మరో వాదన వినిపి స్తున్నది.

హైదరాబాద్ క్రికె ట్ అసోషియేషన్ వివాదంలో అజారుద్దీన్ ఉండటం తో క్రీడా శాఖ కూడా అప్పగించడానికి పార్టీ సుముఖంగా లేదని తెలుస్తున్నది. మైనార్టీ శాఖను అప్పగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం మైనార్టీ శాఖ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వద్ద ఉన్నది. అజారుద్దీన్ మం త్రిగా ప్రమాణం చేశాక, శాఖ కేటాయింపు జరగకపోవడంతో ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి రాష్ట్రం నుంచి రాష్ట్ర వి భజన తర్వాత కూడా ముస్లిం మైనార్టీలు లేని క్యాబినెట్ లేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే దాదా పు 21 నెలలుగా మైనార్టీలకు అవకాశం ఇవ్వకుండా పాలన సాగించారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్‌కు ఉప ఎన్నిక రావడం, అక్కడ ముస్లింల ఓట్లు పెద్ద ఎత్తున ఉండటంతోనే.. హడావుడిగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని, లేదంటే మైనార్టీలకు ఛాన్స్ ఇవ్వకపోయేవారని చర్చ జరుగుతున్నది.