calender_icon.png 6 May, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల్లో.. బీ12 లోపిస్తే!

04-05-2025 12:00:00 AM

విటమిన్ బి12 లోపం పిల్లల్లో సాధారణంగా కనిపించే సమస్యే అయినప్పటికి ఇది లోపించడం వల్ల అనేక రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది.  ఈ లోపాన్ని సులభంగా గుర్తించి.. సరైన ఆహారంతో నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే పిల్లల్లో విటమిన్ బి12 లోపం తలెత్తినప్పుడు పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి.. అవేంటంటే..

-అలసట, బలహీనత.. పిల్లలు ఎప్పుడూ అలసిపోయినట్టు, ఆడుకోవడానికి ఆసక్తి చూపకపోవడం చర్మం పాలిపోవడం.

-చర్మం పాలిపోయి లేత రంగులోకి మారడం లేదా జుట్టు రాలడం.

-జ్ఞాపకశక్తి సమస్యలు. ఏకాగ్రత తగ్గడం, గుర్తుంచుకోవడంలో ఇబ్బందులు.

-చిరాకు, నిరాశ లేదా ఆందోలన ఎక్కువగా కనిపించడం. 

-జీర్ణ సమస్యలు.. ఆకలి మందగించడం, మలబద్ధకం వంటివి.

అయితే.. పై లక్షణాలు కనిపిస్తే.. సరైన ఆహారంతో పిల్లల ఆరోగ్యాన్ని సులభంగా కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. పిల్లలకు సరైన సమయంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహారాన్ని అందిస్తే.. ఈ లోపం సమస్యే కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.