calender_icon.png 6 May, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి చిట్కాలు

04-05-2025 12:00:00 AM

నిత్యం కనీసం మూడు, నాలుగు లీటర్ల వరకు నీటిని తీసుకోవడం తప్పనిసరి. కొందరు పనిలో పడితే ఈ విషయం గుర్తుండకపోవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఫోన్ లో అలారం పెట్టుకోవచ్చు. లేదంటే ఇటీవల వాటర్ ట్రాకింగ్ యాప్ లు సైతం అందుబాటులోకి వచ్చాయి. వాటిని వాడినా మంచిదే.

ఆరెంజ్, నిమ్మ, పుదీన, బెర్రీలు, కీరదోస ముక్కలను ఎక్కువసేపు నానబెట్టిన నీటిని తాగితే శరీరానికి మేలు. పుచ్చకాయ, బొప్పాయి, ముల్లంగి, గుమ్మడికాయ, నారింజ, టమాట, ఆకుకూరలు.. ఇలా పండ్లు.. కూరగాయల రూపంలోనూ శరీరానికి నీటిని అందించవచ్చు. వీటిలో ఉండే విటమిన్లు, పోషకాలు శక్తిని ఇస్తాయి. వాటిలో అవసరమైన ఎలక్ట్రోలైట్లు ఉండి శరీరానికి మేలు చేస్తాయి. వీటితో సలాడ్స్ చేసుకుని కూడా తినొచ్చు.