ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడిగా ఐదవ సారి బి.గోవర్ధన్ ఏకగ్రీవం
19-07-2026 04:58 PM
బోథ్,జూలై 19 (విజయక్రాంతి): ఆదివారం జరిగిన ఏఐ టి యు సి జిల్లా మహాసభల్లో బోత్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ సిపిఐ నాయకులు బి గోవర్ధన్ ఐదవ సారి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో పెట్టిన బాధ్యతలను వమ్ము చేయకుండా కార్మిక శ్రేయస్సు కోసం పాటుపడతానన్నారు. కనీస వేతనాలు అమలు సామాజిక భద్రత కార్మిక వ్యతిరేక విధానాలను ఎండ కడతామన్నారు. ఆయన ఏకగ్రీవ ఎన్నిక పట్ల సిపిఐ ఏఐటీయూసీ నాయకులు హర్షం వ్యక్తపరిచారు.






