calender_icon.png 7 December, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇగ్నైట్ సైన్స్ ఫెయిర్ లో ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ..

06-12-2025 11:22:34 PM

బజార్హత్నూర్ (విజయక్రాంతి): మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సిద్ధార్థ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఇగ్నైట్ సైన్స్ ఫెయిర్ లో రైతులకు, రైతు కూలీలకు ఉపయోగపడే విధంగా వెయిట్ లిఫ్టర్ ప్రదర్శనతో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించాడు. దీనికి గాను విద్యార్థికి రూ. 7 వేల నగదుతో పాటు షీల్డ్, ప్రశంసా పత్రం మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ అందజేశారు. దీనికి పాఠశాల ఉపాధ్యాయురాలు నిఖత్ ఫరిహీన్ గైడ్ టీచరుగా వ్యవహరించారు. అలాగే తనతో పాటు పాల్గొన్న సాయి కీర్తన్ కి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సైన్స్ ఫెయిర్ లో రాష్ట్రంలోని 194 ఆదర్శ పాఠశాలలకు చెందిన 388 ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ సంగీత. పాఠశాల సిబ్బంది అభినందించారు.