calender_icon.png 4 July, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాబు కోవర్టులకు కరెంట్, నల్లా కట్ చేయాలె!

03-07-2025 12:47:29 AM

  1. తెలంగాణలో పెద్ద కాంట్రాక్టులన్నీ వారివే
  2. ఉత్తమన్నా.. బనకచర్లపై లేఖలు రాస్తే లాభం లేదు
  3. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ సంచలన వ్యాఖ్యలు

మహబూబ్‌నగర్, జూలై 2 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై రాజకీయ రగడ కొనసాగుతున్న వేళ జడ్చ ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సం చలన వ్యాఖ్యలు చేశారు. బాలానగర్ మండలం మోతీఘనపూర్‌లో బుధవారం ముడా నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన అనంత రం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోవర్టులే ఎక్కువ మంది ఉన్నారని.. రాష్ట్రంలోని పెద్ద కాంట్రాక్టులన్నీ వాళ్లే చేపడుతున్నారని చెప్పారు.

‘ఉత్త మన్నా.. బనకచర్లపై లేఖలు రాస్తే సరిపోదు.. చంద్రబాబు కోవర్టులకు, కాంట్రాక్టర్ల ఇంటికి కరెంట్ కట్ చేయాలి, నల్లా కనెక్షన్లు నిలిపివేయాలి’ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాం తానికి శాపంగా మారనున్న ఏపీ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలంటే చంద్రబా బు కోవర్టులను కట్టడి చేయాలన్నారు.

వా ళ్లకు చెల్లించాల్సిన బిల్లులను ఆపితే, వాళ్లే వె ళ్లి చంద్రబాబునాయుడు కాళ్లు పట్టుకొని బ నకచర్ల ప్రాజెక్ట్‌ను ఆపిస్తారని అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంచిగ చెబితే ఆంధ్రో ళ్లు వినరని, తాను చెప్పినట్టు చేస్తే వారం రో జుల్లోనే బనకచర్ల బందవుతుందన్నారు. రా ష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్‌లో దందాలన్నీ ఆంధ్రా వారి చేతుల్లో ఉన్నాయన్నారు. 

ముడా నిధులను మళ్లించారు..

గత పదేండ్లలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మీకోసం ఏం చేశారో మీరే ఆలోచించుకోవాలని మోతీఘనపూర్ గ్రామస్తులను ఎమ్మెల్యే కోరారు. మోతీఘనపూర్‌ను అభివృద్ధి చేయకపోగా, ఈ గ్రామానికి రావా ల్సిన రూ.4.50 కోట్ల మూడా నిధులను మహబూబ్‌నగర్‌కు మళ్లించారని విమర్శించారు. తనకు మోతీఘనపూర్‌తో అనుబం ధం ఉందని, అందుకే అభివృద్ధి పనుల్లో ఈ గ్రామానికి ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పా రు.

ఇప్పటివరకు గ్రామంలో రూ.3 కోట్ల రైతు రుణమాఫీ ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లయినా, రేషన్ కార్డయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో 28 ఇందిరమ్మ ఇండ్లను, 157 కొత్త రేషన్ కార్డులను గ్రామానికి మంజూరు చేసినట్టు వెల్లడించారు.