5 April, 2026 | 6:09 PM

ఓటమి ఎరుగని నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్‌ రామ్

05-04-2026 11:53 AM

షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

 ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్  119 జయంతి వేడుకలు

షాద్‌నగర్,(విజయక్రాంతి): భారత దేశ మాజీ ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి పునస్కరించుకొని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ నేత జాంగారి రవి ఆధ్వర్యంలో బ్లాక్ ఆఫీస్ ముందు వున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విర్ల పల్లి శంకర్ మాట్లాడుతూ.... భారత దేశ ఉప ప్రధాన మంత్రి 50 ఏళ్ళ రాజకీయ జీవితంలో దాదాపు 40 ఏళ్లు పార్లమెంట్ సభ్యులుగా, కార్మిక, రక్షణ వ్యవసాయ శాఖల మంత్రిగా పనిచేసి దళిత బహజనుల అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప దళిత నేత, గొప్ప పరిపాలనాద్యక్షుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. 

షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు మాట్లాడుతూ భారత మాజీ ఉపప్రదానిగా, ఈ దేశంలో 40 ఏండ్ల సుదీర్ఘ పార్ల మెంటరియన్ బాబు జగ్జీవన్ రామ్ అని తెలిపారు.దళితులలో అత్యున్నత స్థానాలను అధిరోహించిన గొప్ప నేత బాబు జగజీవన్ రామ్  అని మాజీ ఎమ్మెల్యే అన్నారు. 

ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వాం, వైస్ చైర్మన్ అందే మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,కాంగ్రెస్ పార్టీ నేతలు రఘు నాయక్, కృష్ణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి, బాధేపల్లి సిద్దార్థ, ,  కొమ్ము కృష్ణ, కౌన్సిలర్స్ పెంటయ్య, దిలీప్ కుమార్,ముబరక్ , మల్లేష్ గౌడ్, సీతారాం, టీడీపీ నేత గంధం ఆనంద్, భాస్కర్ రెడ్డి, సర్పంచులు ఎంసి రాజు, నాగిల్ల వెంకటేష్, శివకుమార్ యాదవ్,జేఏసీ నేతలు ఎం జనార్ధన్, నర్సింహులు, దళిత  ఉద్యగ సంఘాల నేతలు ఎర్ర నర్సింహులు, భేరి లింగం, తదితరులు పాల్గొన్నారు.