16 April, 2026 | 3:33 AM

దక్షిణాదికి బాబు వెన్నుపోటు!

16-04-2026 01:55 AM

ద్రోహిగా మిగిలిపోతారా..?

  1. డీలిమిటేషన్ రగడలో ఏపీ సీఎం ఎటువైపు?
  2. సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తున్న ఆగ్రహం

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : దేశ రాజకీయాలను డీలిమిటే షన్ అంశం కుదిపేస్తున్న తరుణంలో దక్షిణాదిలో కీలక పరిణామం చోటుచేసు కున్నది. మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో కేంద్రం నియోజకవర్గాల పునర్విభ జన చేపట్టిందని, ఇది దక్షిణాది రాష్ట్రాలకు గొడ్డలిపెట్టు అని ఆరోపణలు వస్తు న్నవేళ.. మహిళా కోటా బిల్లుపై కేంద్రానికి మద్దతునివ్వాల్సిందిగా వివిధ పార్టీల అధ్యక్షులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖలు సంధించడం ఏమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

దక్షిణాది ప్రయోజనాలను కాపాడటంలో చంద్రబాబు విఫలమై దక్షిణాదిని ‘వెన్నుపోటు’ పొడుస్తున్నారని విమర్శకులు అంటున్నారు. అయితే దక్షిణాది రాజకీయ భవిష్యత్‌కు ఎంతో కీలకమైన డీలిమిటేషన్‌పై ఏపీ సీఎం ఇప్పటివరకు స్పందించకపోవడంపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. కేంద్రం తీసుకువచ్చిన బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళంకు లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన పెరుగుతోంది. అదే సమయంలో అధిక జనాభా ఉన్న యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలకు సీట్లు పెరిగే అవకాశముండటం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే పరిస్థితిని సృష్టిస్తోంది. ఇదే సమయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ‘నారి శక్తి వందన్ అధినియం’ అమలును డీలిమిటేషన్‌తో అనుసంధానం చేయడంతో వివాదం మరింత ముదిరి పాకాన పడింది. 

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దీనికి వ్యతిరేకంగా దక్షి ణాది రాష్ట్రాల నాయకులంతా ఒకే వేదికపైకి రావాలని ఇప్పటికే పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా స్టాలిన్ ఈ అంశంపై పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిం చి, దక్షిణాది ఐక్యతకు పునాది వేస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్రమోదీపై నమ్మ కం వ్యక్తం చేస్తూ చంద్రబాబు సున్నితంగా స్పందించడం ఆయనపై విమర్శలను మరింత పెంచింది.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలను శిక్షిస్తున్నారు అంటూ విమర్శించారు. సోషల్ మీడియాలో చంద్రబాబుపై విమర్శలు వేడెక్కాయి. #సేవ్‌సౌత్‌ఇండియా, #ఫెయిర్‌డీలిమిటేషన్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతుండగా, చంద్రబాబుపై దక్షిణాది ద్రోహి అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఈ వివాదంలో చేరి, ‘చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవాన్ని విడిచిపెట్టకపోతే స్టాలిన్‌ల డీలిమిటేషన్‌ను వ్యతి రేకించాల్సి ఉంటుంది అని నిక్కచ్చిగా ఒక వీడియో షేర్ చేశారు. ఇది కేవలం రాజకీ య వివాదం మాత్రమే కాదు, దేశ ఫెడర ల్ వ్యవస్థలో సమతౌల్యంపై ప్రశ్నలు లేవనెత్తే అంశమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లోక్‌సభ సీట్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ఈ వివాదం మరింత కీలకంగా మారింది. 

ఒకవైపు దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావడానికి ప్రయత్నిస్తుండగా, మరోవైపు చంద్రబాబు తన మిత్రపక్ష ధోరణి, ప్రాంతీయ ఒత్తిళ్ల మధ్య ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి డిలిమిటేషన్ వివాదం దేశ రాజకీయాల్లో ఉత్తర-, దక్షిణ విభేదాలను మళ్లీ ముందుకు తెచ్చింది.