16 April, 2026 | 3:33 AM

ప్రజా సమస్యల పరిష్కారంపై సమీక్ష

16-04-2026 01:55 AM

పాల్గొన్న -సీఎంసీ కమిషనర్ శ్రీమతి జీ సృజన (ఐఏఎస్)

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి జోన్ పరిధిలో జరు గుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై సిఎంసి కమిషనర్ జి.సృజన (ఐఏఎస్) బుధవారం జోనల్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, యూబీడీ, యూసీడీ, విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న పనులన్నింటినీ ‘99 రోజుల ప్రోగ్రాం’లో భాగంగా జూన్ రెండు, 2026 లోపు పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు.

కనీసం 190 పనులను ఈ గడువు లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.జోన్లోని అన్ని రోడ్లకు ఎండ్-టు -ఎండ్ కార్పెటింగ్ చేయాలని, ఎక్కడా గుంత లు లేకుండా జూన్2 లోపు మరమ్మతులు పూర్తి చేయాలని,రోడ్లపై ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు.

మురుగునీటి కాలువల పూడికతీ త వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ చివరి నాటికి జోన్ అంతటా పూడికతీత పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు.వీధి దీపాల సమస్యలపై అసిస్టెంట్ ఇంజనీర్లు తక్షణమే స్పందించాలని, ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, విభాగాల మధ్య సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని అన్నారు.పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రతివారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.