calender_icon.png 6 September, 2025 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో పెట్టుబడులకు ‘బేబిగ్’ ఆసక్తి

06-09-2025 12:55:09 AM

  1. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన జర్మనీ కంపెనీ ప్రతినిధులు
  2. ‘మెడికల్ ఎక్విప్‌మెంట్’ ప్రారంభానికి సహకరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి

 హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి)ఃపెట్టుబడులకు అనుకూలంగా ఉన్న తెలంగాణలో వైద్య పరికరాల (మెడికల్ ఎక్విప్‌మెంట్) ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభిం చేందుకు జర్మనీ కంపెనీ ఆసక్తిగా ఉంది. శుక్రవారం జర్మనీకి చెందిన బేబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్, సీఈవో జార్జ్ చాన్ సారథ్యం లో ప్రతినిధి బృందం తెలంగాణ ముఖ్యమం త్రి ఎ.రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన స్వగృహంలో భేటి అయ్యింది.

ఈ సందర్భంగా బేబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్, సీఈ వో జార్జ్ చాన్ మాట్లాడుతూ.. తెలంగాణలో వైద్య పరికరాల (మెడికల్ ఎక్విప్‌మెంట్) ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు బేబిగ్ మెడికల్ కంపెనీ ఆసక్తిని సీఎంకు తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కంపెనీ ఆసక్తికి అభినందిస్తూ.. ఈ మెడికల్ ఎక్విప్‌మెంట్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

ఈ మెడికల్ ఎక్విప్‌మెంట్ ఉత్పత్తి యూనిట్‌ను నెలకొల్పేందుకు అనువైన స్థలం, ఇతర అంశాలకు సంబంధించి అధ్యయనం చేసి నివేదికను అందించాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో మె డికల్ ఎక్విప్‌మెంట్‌తోపాటు, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే రేడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, వాటిపైకూడా దృష్టి సారించాలని ఈ సందర్భంగా జర్మనీ కంపె నీ ప్రతినిధులను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.