calender_icon.png 6 September, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయక నిమజ్జనానికి మెడికవర్ హాస్పిటల్స్ అత్యవసర వైద్య సేవలు

06-09-2025 12:54:00 PM

హైదరాబాద్: వినాయక నిమర్జనానికి(Vinayaka immersion) వచ్చే భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా తక్షణమే చికిత్స అందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్(Medicover Hospitals) హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్) మీద అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఈ సేవలలో నిపుణులైన వైద్యులు, నర్సులు, అంబులెన్స్‌లతో పాటు ఆర్ బీఎస్, బీపీ చెక్‌అప్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.

అదనంగా, భక్తులకు తాగునీరు అందించేందుకు వాటర్ బాటిల్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ మార్కెటింగ్ హెడ్(Secunderabad Marketing Head) చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్య భద్రత మా మొదటి ప్రాధాన్యం. నిమర్జనానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా మా వైద్య బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా భక్తులకు తక్షణ సేవలు అందించగలగడం మా ఆనందంగా భావిస్తున్నాము” అని తెలిపారు.