calender_icon.png 6 September, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్తవ్యస్తమైన మురుగునీటి వ్యవస్థ.. పట్టించుకునే నాథుడే లేడా ?

06-09-2025 01:01:48 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ మున్సిపల్(Ghatkesar Municipal) అవుషాపూర్ లో జాతీయ రహదారి బైపాస్ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డులో మురుగునీటి వ్యవస్థ అధ్వానంగా మారిoది. గత నెల రోజులుగా పాదచారులు, వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా నెలకొంది. అంతేకాకుండా రహదారి పూర్తిగా వర్షం నీటి కారణంగా రోడ్డు దెబ్బతినడంతో వాహనదారుల రాకపోకలకు చాలా ఆటంకం కలుగుతుంది.  అటువైపుగా వెళ్లే వారికి విపరీతమైన దుర్వాసన రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మున్సిపల్ అధికారులు సమస్యను పరిష్కరించవలసిందిగా మాజీ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్ఛేందర్ రెడ్డి కోరారు.