06-09-2025 12:59:45 PM
రామచంద్రపురం, (విజయక్రాంతి): ప్రముఖ కార్మిక నాయకుడు ఎల్లన్న(Labor leader Ellanna) దశాబ్దాల పాటు కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఆయన స్థానిక కార్మిక సంఘాలలో కీలక పాత్ర పోషించారు. ప్రజల సమస్యల పట్ల ఎల్లప్పుడూ స్పందిస్తూ, కార్మిక వర్గం అభ్యున్నతికి కృషి చేసిన ఎల్లన్న మరణం కార్మిక వర్గానికి తీరని లోటుగా మిగిలిపోనుంది. కార్మిక సంఘ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయనకు నివాళులు అర్పిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.