calender_icon.png 6 September, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తి శ్రద్ధలతో వినాయక శోభాయాత్ర

06-09-2025 12:53:36 AM

శోభాయాత్రలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ శేషా కుమారి

సనత్‌నగర్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): బల్కంపేట్ లోని పరిసర ప్రాంతం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. వినాయక నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన సిరి సిద్ధి వినాయక శోభాయాత్ర విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అమీర్పేట్ డివిజ న్ మాజీ కార్పొరేటర్ శేషు కుమారి పాల్గొని వినాయకుడి ఆశీస్సులు పొందారు.శోభాయాత్ర విజయవంతం కావడానికి కమిటీ స భ్యులు కళ్యాణ్, మల్లికార్జున్, అరుణ్, కార్తీక్, సతీష్ విశేష కృషి చేశారు.

వీరితో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, స్థానిక మహి ళా నాయకులు కూతురు నరసింహ, బల రాం, లక్ష్మి భాష, నాగలక్ష్మి, దుర్గా, రాణి కౌర్ పా ల్గొని శోభాయాత్రకు మరింత భక్తి వైభ వం జోడించారు.శోభాయాత్రలో వినాయక భజనలు, డప్పు వాయిద్యాలు, హారతి దృ శ్యా లు భక్తుల మనసులను ఆకట్టుకున్నాయి.

ఊ రేగింపు మార్గమంతా భక్తులు గణనాథుడి నామస్మరణ చేస్తూ పూలతో, పండ్లతో స్వా గతం పలికారు. వినాయకుడి ఆశీర్వాదాల తో ఇళ్లలో శాంతి, సంపదలు వెల్లివిరియాల ని ప్రార్థించారు. ఈ సందర్భంగా మాజీ కా ర్పొరేటర్ శేషు కుమారి మాట్లాడుతూ గణనాథుడు విఘ్నాలను తొలగించి ప్రజలంద రికీ ఆనందం, ఆరోగ్యం కలిగించాలని కోరుకుంటున్నాను. సిరిసిద్ధి వినాయక శోభాయా త్రలో పాల్గొనడం నాకు ఆనందాన్నిచ్చింది.