calender_icon.png 11 July, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్స్‌ ఆస్పత్రి బాత్‌రూమ్‌లో పసికందు మృతదేహం

10-07-2025 02:49:53 PM

హైదరాబాద్: నిమ్స్(Nizam's Institute Of Medical Sciences) ఆసుపత్రిలోని బాత్రూంలో గురువారం పసికందు మృతదేహం లభించడం కలకలం రేపింది. అప్పుడే పుట్టిన పసికందును బాత్రూంలో పడేసినట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు శిశువు మృతదేహాన్ని టాయిలెట్ లో పడేశారు. ఆస్పత్రి సిబ్బంది టాయిలెట్ ని క్లీన్ చేస్తుండగా పసికందు మృతదేహం బయటపడింది. నిమ్స్ ఆస్పత్రిలోని ఓపీ హహిళల బాత్ రూంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.