9 June, 2026 | 2:14 AM

మెలిగిరిపేటలో మొసలి పిల్లలు!

09-06-2026 01:29 AM

20కి పైగా పిల్లలు, 65 గుడ్లు గుర్తింపు  

సదాశివపేట, జూన్ 8: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మెలిగిరిపేట గ్రామ శివారులో 20కి పైగా మొసళ్ల పిల్లలు కనిపించడం కలకలం రేపింది. గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టి సుమారు 65 మొసలి గుడ్లను గుర్తించారు.

సమీపంలోని చెరువులు, నీటి వనరుల్లో పెద్ద సంఖ్యలో మొసళ్లు ఉండే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువుల వద్దకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అటవీ శాఖ సిబ్బంది మొసళ్ల పిల్లలను సురక్షితంగా పట్టుకుని మంజీరా నదికి తరలించారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో మరిన్ని మొసళ్లు ఉన్నాయా అనే దానిపై అధికారులు నిఘా పెంచి పరిశీలనలు కొనసాగిస్తున్నారు.