తాడ్వాయి మండలానికి 11,417 పుస్తకాలు
09-06-2026 01:30 AM
తాడ్వాయి, జూన్, 8( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలానికి మొత్తం 11,417 పుస్తకాలు వచ్చినట్లు ఎంఈఓ రామస్వామి తెలిపారు వచ్చిన పుస్తకాలను మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో సోమవారం ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు పుస్తకాలు రావడం జరిగిందనన్నారు. ఇప్పటివరకు దాదాపు 95 శాతం పుస్తకాలు మండలానికి వచ్చాయన్నారు. మిగతా పుస్తకాలు రాగానే వెంటనే పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయరాములు, ప్రధానోపాధ్యాయులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.






