'బచ్చలమల్లి' రగ్గడ్ అవతార్
హీరో అల్లరి నరేశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం బచ్చలమల్లి’. ఇందులో మునుపెన్నడూ చూడని రగ్గడ్ అవతార్‌లో కనిపించనున్నారాయన. సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో సామజవరగమన’, ఊరు పేరు భైరవకోన’ వంటి సినిమాలను అందించిన హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ రస్టిక్ యాక్షన్ డ్రామా డిసెంబర్ 20న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా బచ్చల మల్లి’ ట్రైలర్‌ను స్టార్ హీరో నాని లాంచ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉందో చూస్తే.. బచ్చల మల్లి (అల్లరి నరేశ్) వర్షంలో అపస్మారక స్థితిలో పడిఉన్న సీన్‌తో ట్రైలర్ ఆసక్తికరంగా ఓపెన్ అయ్యింది.
రావు రమేశ్ పోషించిన పోలీసు అధికారి పాత్ర బచ్చల మల్లి’ నిర్లక్ష్య ప్రవర్తనను హైలైట్ చేసే కీలకమైన సంఘటనలను వివరిస్తాడు. ఆ సంఘటనల్లో ఒకటి.. సత్యవరం జాతరలో జనంతో అతని హింసాత్మక ఘర్షణ, మరొకటి అతను వేశ్య కోసం పోలీసులపై దాడి చేయడం! అతని ఫెరోషియస్ గతం ఉన్నప్పటికీ, ఒక అమ్మాయి అతని జీవితంలోకి ప్రవేశించడంతో మార్పునకు దారితీస్తుంది. అయితే వీరి బంధాన్ని ఆమె తండ్రి వ్యతిరేకించడం, ఏదో త్రెట్ చూడటం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. మొత్తంగా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అల్లరి నరేశ్ బోల్డ్, రగ్గడ్ మొండి పట్టుదలగల పాత్రలో ఆరదగొట్టారు. ఈ పాత్ర కోసం పూర్తి మేకోవర్ అయ్యారు. పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ఇచ్చారు.
అమృత అయ్యర్ ప్రేమికురాలిగా అద్భుతంగా కనిపించింది. ఈ ట్రైలర్‌లో రోహిణి, రావు రమేశ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్షతో సహా ఇతర ప్రముఖ నటీనటులు కూడా ఉన్నారు. సుబ్బు మంగాదేవి ఇంటెన్స్ కథను తీసుకుని, గొప్ప ఎంగేజ్‌మెంట్‌తో ప్రజెంట్ చేశారు. కథనం ప్రారంభం నుంచి ముగింపు వరకు కట్టిపడేసేలా ఉంది. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ బీజీఎం బాగున్నాయి. హాస్య మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. సుబ్బు మంగాదేవి కథ, సంభాషణలు రాశారు. విప్పర్తి మధు స్క్రీన్‌ప్లేను నిర్వహించగా, అదనపు స్క్రీన్‌ప్లేకు విశ్వనేత్ర సహకారం అందించారు. టీజర్ భారీ అంచనాలను సృష్టించగా, ట్రైలర్ ఆ అంచనాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.






