కొత్త టీమ్‌ను మెచ్చుకుంటున్నారు
15-12-2024 07:41 PM
సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా తెరకెక్కిన ప్రణయ గోదారి’ చిత్రం డిసెంబర్ 13న విడుదలైంది. పీఎల్ విఘ్నేశ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పారమళ్ల లింగయ్య నిర్మించగా, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కొత్త టీమ్ అయినా చాలా బాగా చేశారని మెచ్చుకుంటున్నారు’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక ప్రసాద్, సంగీత దర్శకుడు మార్కండేయ, నటుడు సునీల్ రావినూతల, నటి ఉషాశ్రీ, కెమెరామెన్ ప్రసాద్ ఈదర, కొరియోగ్రాఫర్ కళాధర్ తదితర చిత్రబృందం మాట్లాడి.. ఈ సినిమాతో ఉన్న తమ అనుబంధాన్ని, అభిప్రాయాల్ని పంచుకున్నారు.






