16 June, 2026 | 2:35 AM

క్రియేటివ్ హైస్కూల్‌లో.. బ్యాక్ టూ స్కూల్ కార్యక్రమం

16-06-2026 12:00 AM

ఖమ్మం, జూన్ 15(విజయక్రాంతి): స్థానిక హర్కారా బావి సెంటర్‌లోని క్రియేటివ్ హై స్కూల్‌లో సోమవారం రీఓపెన్ డే సందర్భం గా బ్యాక్ టూ స్కూల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కమ లాకర్ బిజ్జాల మాట్లాడుతూ పోయిన విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ప్రారంభించిన ఏసీ ప్రీ ప్రైమరీ తరగ తులను కల్పవృక్ష ప్రోగ్రామ్స్ ఎంతో విజయవంతంగా తల్లిదండ్రులు ప్రోత్సహించారు.

దీనిలో భాగంగా ప్లే బేస్‌డు లేర్నింగ్, థీమ్ బేస్‌డు యాక్టివిటిస్, ల్యాంగ్‌వేజ్ స్కిల్స్, న్యూమరేసి స్కిల్స్, సెన్సోరియల్ యాక్టివిటీస్‌తో ప్రత్యేక కరిక్యూలమ్‌తో ప్రత్యేక భోదన. పోయిన విద్యా సంవత్సరం నుంచి ప్రైమరీ, హైస్కూల్ తరగతులకు కోడింగ్, రోబోటిక్స్ నందు శిక్షణ.. దీని వలన సాంకేతిక పరిజ్ఞానం, ప్రాబ్లం సాల్వియింగ్, లాజికల్ థింకింగ్, రీజినింగ్ సృజనాత్మకత, భవిష్యత్తు ఉద్యోగ అవ కాశాలకు ఉపయోగపడుతుంది. విద్యార్థులు చేసిన నృత్యాలు విద్యార్థులను ఎంతగానో అలరించాయి.  ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ బిజ్జాల కమలాకర్, డైరెక్టర్ బిజ్జాల కౌషిక్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.