31 May, 2026 | 6:45 PM

Breaking News

రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •   అది రైతు డిస్కం కాదు... రైతుల ప్రాణాలు తీసే 'బలిపీఠం'!   •   వరికొయ్యలు, పంట అవశేషాలను కాల్చొద్దు   •  

బడంగ్‌పేట్ అవినీతి కుంభకోణం

08-04-2026 12:21 AM

సిట్ లేదా సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్

బడంగ్పేట్, ఏప్రిల్ 7(విజయక్రాంతి): బడంగ్పేట్ మున్సిపల్ సర్కిల్లో వెలుగుచూసిన రూ.150 కోట్ల భారీ అవినీతిపై భారతీయ జనతా పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే డిప్యూటీ కమిషనర్ సరస్వతి తో సహా 9 మంది అధికారులు సస్పెండ్ కావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ దోపిడీ కేవలం అధికారులకే పరిమితం కాలేదని, దీని వెనుక బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతల హస్తం ఉందని బీజేపీ క్లస్టర్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

పనులు చేయకుండానే టెండర్లు మంజూరు చేయడం, బాలాపూర్ పాఠశాల బాత్రూం మరమ్మతుల పేరుతో రూ. 40 లక్షలు కాజేయడం వంటి అక్రమాలను బీజేపీ ఎండగట్టింది. తాము చేసిన ఫిర్యాదుల వల్లే ఈ అవినీతి బాగోతం బయటపడిందని, దోషులు దొరికిపోతారనే భయంతోనే కాంగ్రెస్ నేతలు బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని వారు మండిపడ్డారు.సస్పెండ్ అయిన అధికారులు నోరు విప్పి అసలు సూత్రధారులను బయటపెట్టాలి.

ఈ కేసును సిట్  లేదా సీబీఐ తో నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు.అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం తో పాటు ప్రజల నుండి దోచుకున్న సొమ్మును పూర్తిగా రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.ధర్నాలో బీజేపీ మాజీ కార్పొరేటర్లు, వివిధ క్లస్టర్ల అధ్యక్షులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని, అవినీతి అంతమయ్యే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.