కేజ్రీవాల్‌కు బెయిల్
లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశం
మార్చి 1 నుంచి జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ, జూన్ 20: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తీహార్ జైల్లో ఉన్న ఆయనకు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. రూ.1 పూచీకత్తు సమర్పించాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది.
రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం ప్రత్యేక న్యాయమూర్తి నియాహ్ బిందు వాదనలు విన్నారు. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనను కోర్టు పట్టించుకోలేదు. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఇదే కేసులో గతంలో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన నెలరోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సత్యమే గెలిచింది: ఆప్
కేజ్రీవాల్‌కు బెయిల్ లభించటంపై ఆప్ నేతలు సంతోషం వ్యక్తంచేశారు. సత్యం ఇబ్బందులు ఎదుర్కోవచ్చుగానీ అంతిమంగా అదే విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.






