ఘనంగా బక్రీద్ వేడుకలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 28 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో గురువారం బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అనంతరం ఒకరికొకరు ఈద్ ముభారక్ తెలియజేసుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈద్గా వద్దకు చేరు కుని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, ము న్సిపల్ చైర్మన్ ఆకాష్తో కలిసి ముస్లిం సోదరులకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.
పండుగలను ప్రజలంతా ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, కాంగ్రెస్ నియో జకవర్గ ఇంచార్జ్ శ్యాం నాయక్, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ ఇరుకుల మంగ ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగం, సహనం, దైవభక్తికి ప్రతీకగా నిలుస్తుందని, సమాజంలో సోదరభా వాన్ని పెంపొందిస్తుందని వారు పేర్కొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించా లని ఆకాంక్షించారు. అనంతరం ప్రార్థనలకు హాజరైన ముస్లిం పెద్దలు, యువకులను ఆ ప్యాయంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.






